బండి సంజయ్ సవాల్… సీఎం పదవికి రాజీనామా చేస్తావా..?

హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కరెన్సీని గెలిపిస్తారా? బీజేపీ కాషాయం జెండాను గేలిపిస్తారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఉద్యమ కారుడు మంచి నాయకుడు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని హుజూరాబాద్ లో నింపారు. ఇక్కడి ప్రజలు చైతన్యం కలిగిన ప్రజలు. అయితేప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచు కున్న నేత ఈటల రాజేందర్. ఆయన కల్మషం లేని బోలా మనిషి ఆయనకు అన్యాయం చేస్తే పాపం తగులుతుంది. ఆయన తో లబ్ది పొందిన వారు ఆయనను వదిలిన వారికి పాపం తప్పక తగులుతుంది. కేసీఆర్ ఉద్యమం చేయెలే ఎం చేయలే దొంగ దీక్ష చేశారు. విద్యార్థుల ఆగ్రహం తో తప్పని పరిస్థితిలో దొంగ దీక్ష చేశారు. ఎన్ని చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం సాధించి తీరుతారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ విజయం సాధించి తీరుతారు. హుజూరాబాద్ లో బీజేపీ విజయం సాధింస్తే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈటల రాజేందర్ విజయం సాధించి అసెంబ్లీ లో అడుగు పెడుతారు. రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్ లు ప్రజల పక్షాన అసెంబ్లీ లో గలం వినిపిస్తారు. కార్యకర్తలు అంకిత భావం తో పని చేసి విజయం సాధించేందుకు కృషి చేయాలి అని పేర్కొన్నారు.

-Advertisement-బండి సంజయ్ సవాల్... సీఎం పదవికి రాజీనామా చేస్తావా..?

Related Articles

Latest Articles