రేవంత్‌రెడ్డి, సోదరుడు సంజయ్‌ వ్యాఖ్యలకు ఎంపీ అరవింద్‌ కౌంటర్

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, తన సోదరుడు డి. సంజయ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్.. బాన్సువాడ, బోధన్ నియోజకవరర్గాల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారు.. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన అరవింద్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సెప్టిక్ ట్యాంక్ లకు నేను దూరంగా ఉంటానని వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు దిక్కులేరు. .డబ్బులిచ్చి కార్యక్రమాలకు రప్పిస్తున్నారు అని ఆరోపించిన ఆయన.. రేవంత్‌రెడ్డి తన కోపాన్ని రాహుల్ గాంధీ మీద చూపించాలని సూచించారు.. ఇక, దేశ వ్యాప్తంగా బీజేపీ పెరుగుతుంటే.. కాంగ్రెస్ పార్టీ తగ్గుతోందని ఎద్దేవాచేసిన అరవింద్.. ఇంతకు బీజేపీని రేవంత్‌రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు.

మరోవైపు.. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు.. పోటీ చేసిన వారికి డిపాజిట్లలో సగం ఓట్లు కూడా రావంటూ సెటైర్లు వేశారు అరవింద్.. భాజపాలో జాతీయ అధ్యక్షుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ సమానమే అన్నారు. ఇక, తనపై సోదరుడు డి.సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. సంజయ్ తో నాకు చిన్నప్పటి నుంచే ఎలాంటి సంబంధం లేదు.. ఇక ముందూ ఉండదన్నారు.. సంజయ్.. లోక్ సభ అభ్యర్థి అయినప్పుడు ఆలోచిద్దాం అన్నారు..

Related Articles

Latest Articles

-Advertisement-