సినీరంగాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు…

గత నాలుగురోజులుగా ఏపీలో వాద, ప్రతివాదాలతో రాజకీయాలు దిగజరాయి అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వుండి దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేయడం పలాయనవాదం. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం చెందింది. పేదప్రజల నడ్డివిరిచే విధంగా పాలన సాగతోంది. సినీరంగాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు అని తెలిపారు. జనసేన బీజేపీ కలిసి పని చేస్తాయి. రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదుగుతాము అని అన్నారు.

ఇక పాలనను, ప్రభుత్వాన్ని వైసీపీ సర్కార్ ప్రయివేటీకరించింది. స్టీల్ ప్లాంట్ నుంచి 30 మిలియన్ మెట్రిక్ టన్నుల సాధనే ధ్యేయంగా వున్నాము. ఉద్యోగుల అభ్యంతరాలను తాము గౌరవిస్తాము. వారిపట్ల తమకు సానుభూతి వుంది. వారి ప్రయోజనాలకు భంగం కలుగవు. రాజకీయపార్టీలే తమ స్వార్ధం కోసం ఉక్కుఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజకీయ పక్షాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరటామంటే అది బూతు. జనసేన శ్రమదానం చేసి రోడ్లు వేస్తామని చెప్పినా ప్రభుత్వంలో చలనంలేదు. సారాయి, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ లను నుంచి దృష్టి మళ్లించేందుకే పవన్ కల్యాణ్ తో వివాదం తెరపైకి తెచ్చారు అని పేర్కొన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.

-Advertisement-సినీరంగాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు...

Related Articles

Latest Articles