నటి మీరా చోప్రాపై బీజేపీ ఫిర్యాదు

నటి మీరా చోప్రా ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారితీసింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఫ్రంట్ లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలియడంతో మహారాష్ట్ర బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇది ఫేక్ ఐడీ అని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు థానే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను మీరా చోప్రా కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో తన పేరిట ప్రచారంలో ఉన్న ఐడీ కార్డు తనది కాదని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు తాను వ్యతిరేకం అని పేర్కొంది. ఇక మీరా టాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే ‘బంగారం’ ‘వాన’ వంటి సినిమాల్లో నటించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-