బాల్క సుమన్ చెన్నూరును వదిలి.. హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్నారు

కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోతున్నామని చెన్నూర్ నియోజకవర్గ రైతులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘కాంట్రాక్టుల పేరుతో దోచుకునేందుకు రీడిజైన్ చేపట్టారని.. రీడిజైన్ పేరుతో కోట్లు వృథా చేస్తున్నారన్నారు. ఢిల్లీలో కేసీఆర్ ఇల్లు తుగ్లక్ రోడ్డులో ఉంటుంది, అందుకే కేసీఆర్ తుగ్లక్ పాలన చేస్తున్నారు. కాళేశ్వరంతో కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని, కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో రైతులు నష్టపోతున్నారని వివేక్ తెలిపారు.

సీఎం కేసీఆర్ కు, ఎమ్మెల్యే బాల్కసుమన్ కు రైతు సమస్యలు పట్టడం లేదని వివేక్ విమర్శించారు. ఇప్పటివరకు 250 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి వృథా చేశారని, కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. బాల్క సుమన్ చెన్నూరును వదిలి.. హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. బాల్క సుమన్ చెన్నూరులో సమస్యలు గాలికి వదిలేశారు. బాల్కసుమన్ రాజీనామా చేసి.. హుజురాబాద్ ప్యాకేజీ చెన్నూరుకు తేవాలన్నారు. సుమన్ రాజీనామానే కాళేశ్వరం ముంపు రైతుల సమస్యలకు పరిష్కారమన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ఇష్యూను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాను.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కేసీఆర్ దోచుకుంటున్నారని’ వివేక్ విమర్శలు గుప్పించారు.

Related Articles

Latest Articles

-Advertisement-