కేంద్రానికి జగన్ లేఖలు ప్రేమ లేఖల మాదిరి ఉన్నాయి…

తెలంగాణ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యేలు కోవర్టులుగా పనిచేస్తున్నారు. టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి రాసిన లేఖ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అని అన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థనరెడ్డి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే లేఖ రాసిన ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలాను యదేచ్చగా వాడటం వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేను‌కూడా పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్ళకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకున్న సీఎం నోరు మెదపటం లేదు అన్నారు.

ఇక రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆంద్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితులో ఉంది. కులాల కార్పోరేషన్ ద్వారా ఒక్క కులానికి న్యాయం చేయలేదు. షెడ్యూల్డ్ కులాల నిధులను ప్రభుత్వం వాడుకుంటుంది. కేంద్రానికి జగన్ రాస్తున్న లేఖలు ప్రేమ లేఖలు మాదిరి ఉన్నాయి అని తెలిపారు. కేంద్రానికి లేఖ రాసి వివాదం నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. శ్రీశైలం డ్యాంలో నీరు అడుగంటినా తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా జగన్ నోరెత్తరు. రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రభుత్వానికి వైసీపీ నాయకులు తాకట్టు పెట్టారు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-