కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఉద్యమంలా పనిచేయాలి..!

తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం అప్పుడు ఉద్యమించాం… ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దించేందుకు కార్యకర్తలు ఉద్యమంలా పనిచేయాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారానికి చమరగీతం పడాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి, బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలన్నారు.. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర సంపదను దోచుకొని రాష్ట్రాన్ని చిరిగిన విస్తారాకుల తయారు చేశాయని మండిపడ్డ ఆమె… గాడి తప్పిన తెలంగాణని గాడిలో పెట్టాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.. ఇక, సీఎం కేసీఆర్ ప్రజల మేలుకోసం కాకుండా అధికార కాంక్ష కోసమే పనిచేస్తున్నారని ఆరోపించిన విజయశాంతి.. కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.. బీజేపీ అధికారంలోకి వస్తే సంజీవనిలా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-