బెంగాల్ నేత సువేందు అధికారి కీల‌క వ్యాఖ్య‌లు…ఓట‌మికి ఇదే కార‌ణం…

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఊహించిన‌దానికి వ్య‌తిరేకంగా ఫ‌లితాలు వెలువ‌డ్డాయి.  ఎట్టిప‌రిస్థితుల్లో కూడా బీజేపీ 170 నుంచి 180 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని అంతా అనుకున్నారు.  కానీ, ఫ‌లితాలు తృణ‌మూల్‌కు అనుకూలంగా రావ‌డంతో అంతా షాక్ అయ్యారు.  అయితే, నందిగ్రామ్‌లో నువ్వానేనా అన్న‌ట్టుగా సాగిన పోరులో బీజేపీ నేత సువేందు అధికారి విజ‌యం సాధించారు.   అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మిపై పార్టీ సమీక్ష‌ను నిర్వ‌హించింది.  ఇక ఇదిలా ఉంటే, పూర్వ మేదినీపూర్ జిల్లాలోని చందీపూర్ ప్రాంతంలో జ‌రిగిన పార్టీ స‌మావేశంలో బెంగాల్ ప్ర‌తిప‌క్ష‌నేత సువేందు అధికారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  

Read: “సూర్య40” ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్… ఎప్పుడంటే?

తొలి రెండు విడ‌త‌ల పోలింగ్‌లో ప్ర‌జ‌ల నుంచి భారీ మ‌ద్ద‌తు ల‌భించింద‌ని, దీంతో బీజేపీ నేత‌లు అతివిశ్వాసం, అతితెలివి ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల‌న ఓట‌మిపాల‌య్యార‌ని తెలిపారు. క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేయ‌డంపై నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం వ‌ల‌నే త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చిన‌ట్టు సువేందు అధికారి పేర్కోన్నారు.  అయితే, సువేందు అధికారి చేసిన వ్యాఖ్య‌ల‌పై తృణ‌మూల్ కాంగ్రెస్ స్పందించింది.  ఒట‌మిని ఇత‌రుల‌పై మోప‌డం స‌రికాద‌ని, 200 ల‌కు పైగా సీట్లు గెలుచుకుంటామ‌ని సువేందు అధికారి కూడా చెప్ప‌లేదా అని తృణ‌మూల్ నేత కునాల్ ఘోష్ ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి దీదీ చేసిన అభివృద్ధిని చూసే ప్ర‌జలు ఓటు వేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-