టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే…

కోవిడ్ విషయంలో ప్రపంచంలోనే భారత్ ఎక్కడ లేని విధంగా 77 కోట్ల డోసుల టీకాలు ఇచ్చింది. థర్డ్ వేవ్ మ్యుటేషన్ అయి వస్తే కూడా ప్రాణనష్టం జరగకుండా వ్యాక్సునేషన్ ను ఉద్యమంలా మార్చారు ప్రధాని మోడీ అని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావ్ పీసీ అన్నారు. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ కు అన్ని విషయాల్లో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే అని తెలిపారు. తెలంగాణ విమోచనం విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ తీసుకొచ్చిన సంప్రదాయాన్ని టీఆర్ఎస్ కొనసాగిస్తోంది. ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చి వాటిని విస్మరించడం టీఆర్ఎస్ బ్రాండ్ అని తెలిపారు.

ఇక నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో మోసం దగా చేసింది. దేశంలోనే అవినీతి ప్రభుత్వం టీఆర్ఎస్. ఆ పార్టీది కుటుంబ పాలన టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాము. హుజూరాబాద్ లో బీజేపీ గెలుస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మొత్తాన్ని హుజూరాబాద్ లో పెట్టారు. టీఆర్ఎస్ హుజూరాబాద్ లో డబ్బులను వరదలా పారిస్తుంది. మంత్రులు ఇంటింటికీ మైక్రో సర్వే చేస్తున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుంది. నిధులు నియామకాలు అన్ని హుజూరాబాద్ కోసమే తీసుకొస్తున్నారు. దీన్ని బట్టి కేసీఆర్ బీజేపీ కి భయ పడుతున్నారు. కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు కావడం లేదు అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-