బీజేపీ నేత కీల‌క వ్యాఖ్య‌లు: అక్క‌డ కూడా మ‌మ‌త‌ను ఓడిస్తాం…

త్వ‌ర‌లోనే బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల‌కు ఉపఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఉప ఎన్నిక‌ల్లో భ‌వానీపూర్ నుంచి ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం మ‌మ‌త నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే.  నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేయ‌గా, ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ ఆయ‌న‌పై పోటీకి నిల‌బ‌డింది.  గ‌తంలో సువేందు అధికారి ఈ నియోజ‌క వ‌ర్గం నుంచి తృణ‌మూల్ పార్టీ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు.  ఈ ప్రాంతంలో ఆయ‌న‌కు గట్టి ప‌ట్టు ఉన్న‌ది.  అయిన‌ప్ప‌టికీ మ‌మ‌త ఆయ‌న‌పై పోటీ చేయ‌డంతో ఆ నియోజ‌కవ‌ర్గ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారాయి.  మ‌మ‌తా బెనర్జీ ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ త‌న పాత నియోజ‌క వర్గ‌మైన భ‌వానీ పూర్ నుంచి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. భ‌వానీపూర్ నియోజ‌క వ‌ర్గం మ‌మ‌తకు కంచుకోట లాంటిది.  భ‌వానీపూర్ ఉప ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీని ఓడిస్తామ‌ని బీజేపీ నేత షాన‌వాజ్ హుస్సేన్ పేర్కొన్నారు.  భ‌వానీపూర్‌లో కూడా బీజేపీ విజ‌యడంకా మొగిస్తుంద‌ని, మ‌మ‌తను ఓడించి తీరుతామ‌ని అంటున్నారు బీజేపీ నేత‌లు.  

Read: గుడ్‌న్యూస్‌: రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే…

Related Articles

Latest Articles

-Advertisement-