మమ‌తా బెన‌ర్జీపై బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు… దుర్గామాత‌ను పూజిస్తాం కానీ…

బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  దుర్గామాత ను తాము గౌర‌విస్తామ‌ని, దుర్గామాత బెంగాల్‌కు గౌర‌వ‌మ‌ని, అయితే సెక్యుల‌ర్ అని చెప్పుకునే కొంద‌రు బెంగాల్ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు.  ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని ప‌రోక్షంగా విమ‌ర్శిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  మ‌మ‌తా బెన‌ర్జీని పోలి ఉన్న దుర్గామాత విగ్ర‌హాన్ని కొంద‌రు ఏర్పాటు చేయ‌డంపై ఆయ‌న ఈ విమ‌ర్శ‌లు చేశారు.  ఇలాంటి చ‌ర్య‌లు బెంగాల్ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తాయ‌ని, బెంగాల్ సంప్ర‌దాయానికి, సంస్కృతికి ఇలాంటివి మంచివి కాద‌ని అన్నారు.  

Read: క‌డ‌ప జిల్లా నేతలతో ముగిసిన చంద్రబాబు భేటీ… కీల‌క నిర్ణ‌యాలు…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-