ఈటల రాజేందర్.. రాముడు మంచి బాలుడు లాంటివాడు..!

ఈటల రాజేందర్.. రాముడు మంచి బాలుడు లాంటి వ్యక్తి.. కానీ, ఆయన్ను కూడా మోసం చేశారు రంటూ సీఎం కేసీఆర్‌ కుటుంబంపై ఫైర్‌ అయ్యారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్… కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజురాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజేందర్ అన్న రాముడు మంచి బాలుడు లాంటి వాడు.. ఆయన్ను కూడా మోసం చేసింది కేసీఆర్‌ కుటుంబం అని ఆరోపించారు.. కేసీఆర్‌ అయన కుటుంబం అంతా దళిత వ్యతిరేకులు అంటూ విమర్శించిన బాబు మోహన్… సీఎం కేసీఆర్ దళిత బంధువు కాదు దళిత దుష్మన్ అంటూ మండిపడ్డారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న మన దళితులను పొట్టనబెట్టుకున్నారంటూ ఫైర్ అయిన ఆయన.. పోలీస్‌స్టేషన్‌ పెట్టి కొట్టించారని ఆరోపించారు. హుజురాబాద్‌లో బిచ్చగాళ్లు పడ్డట్టు టీఆర్ఎస్‌ నేతల హడావుడి ఉందని సెటైర్లు వేసిన బాబు మోహన్.. మీరు గెలవడం పగటికల అని తెలుసుకోండి అంటూ కామెంట్ చేశారు.

-Advertisement-ఈటల రాజేందర్.. రాముడు మంచి బాలుడు లాంటివాడు..!

Related Articles

Latest Articles