దేశ ప్రజలకి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి : బీజేపీ లక్ష్మణ్‌

పంజాబ్‌లో జరిగిన ఘటన పై తెలంగాణ ప్రజలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ముసుగులో ప్రధాని ప్రాణానికే ప్రమాదం కలిగే పన్నాగం కాంగ్రెస్ పన్నిందని ఆయన ఆరోపించారు. మన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ బాధ్యత రహితంగా, హేళనగా మాట్లాడారని, అక్కడి ప్రభుత్వ లోపాలను ఖండించాల్సింది పోయి.. బీజేపీ తెలంగాణలో బలోపేతం అవుతున్నదని అక్కసుతో మాట్లాడారని విమర్శించారు.

కాంగ్రెస్ కి వత్తాసు పలుకుతున్నారు అంటే ఆ పార్టీ కి టీఆర్‌ఎస్‌ తోక పార్టీ గా మారుతుందా అని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. కన్హయ్య కుమార్ లకు ఊతం ఇచ్చేలా మాట్లాడారని, దేశ ప్రజలకి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో భద్రతా వ్యవస్థను చూసేది కేంద్రమే. సీఎం ఢిల్లీ వెళితే భద్రత కల్పించేది కేంద్రమే. కుమారుణ్ణి మందలించకుండా సీఎం మౌనం వహించడం ఆయనకు తగునా అని లక్ష్మణ్‌ మండిపడ్డారు.

Related Articles

Latest Articles