ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. కలెక్టర్‌, సీపీని బదిలీ చేయండి..

హుజురాబాద్‌లో పొలిటికల్‌ హీట్ ఓవైపు కొనసాగుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంపై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది… కరీంనగర్‌ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులను బదిలీ చేయాలని.. ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి కోరింది.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇంటెలిజెన్స్ వాళ్లు ఉంటున్నారు, ఫోటోలు కూడా తీసుకుంటున్నారు, దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసి ఫ్రీజ్ చేశారు.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పోలింగ్ రోజు విడుదల చేసేందుకు చూస్తున్నారు అంటూ ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇక, టీఆర్ఎస్ మీటింగ్ లో పోలీసులు భోజనాలు వడ్డిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరిని వెంటనే బదిలీ చేయాలని కోరింది. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికలు వస్తాయనే ఉద్దేశ్యంతోనే ఆ అధికారులను తీసుకొచ్చారని ఆరోపించిన బీజేపీ.. రిటర్నింగ్ అధికారి హరీష్‌రావుకి దగ్గర వ్యక్తి అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

-Advertisement-ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. కలెక్టర్‌, సీపీని బదిలీ చేయండి..

Related Articles

Latest Articles