రైతుల కోసం రాళ్ల దాడులు భరిస్తాం: బండి సంజయ్‌

రాష్ర్టంలో తాను చేస్తున్న పర్యటనల్లో జరుగుతున్న ఘర్షణలపై బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ స్పందించారు. రైతుల కోసం రాళ్ల దాడులనైనా భరిస్తామన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకే వత్తాసు పలుకుతుం దన్నారు. రైతుల తో మాట్లాడుతుంటే రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారని, 70మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు. దాడులు జరుగు తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. పోలీసులపై దాడులు జరిగినా స్పందించడం లేదన్నారు. కేసీఆర్‌ కాళ్లు మొక్కినా ఐఏఎస్‌, ఐపీఎస్‌ లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని చెప్పడం కోసమే, వెంక ట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాళ్ల దాడిలో మీడి యా వారికి సైతం గాయాలు అయ్యాయన్నారు. రైతుల చేతిలో రాళ్లు, కోడిగుడ్లు ఉంటాయా రైతులు దాడులు చేస్తారా అంటూ బండి సంజయ్‌ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. తాము ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే యాత్రలు చేస్తున్నామని దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు కూడా అధ్వానంగా ఉన్నాయని దీనికి ఖచ్చితంగా కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రా లను చేపడితే రైతులు వరి ధాన్యం కుప్పల మీద ఎందుకు చనిపో తున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. బెంగాల్ లో మూడు నుం డి 88 సీట్ల కు వచ్చామన్నారు. అవినీతి ముఖ్యమంత్రిని చూసి తెలం గాణ ప్రజలు బాధపడుతున్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఒక మాట చెబితే వెంటనే అమలు కావాలి. వ్యవసాయ చట్టాలు భేష్ అన్నాడు. ఇప్పు డు ఏమో వ్యతిరేకిస్తాం అని అంటున్నారు. కల్లాల్లో ధాన్యం ఉంది దయచేసి కొనండి ఆరుగురు రైతులు చనిపోయారని సంజయ్‌ వాపోయారు.

కేంద్రం 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ఒప్పందం కుదుర్చుకుంది. పాలమూరు రైతులు పక్క రాష్ట్రంలో అమ్ముకుం టున్నారు… దానికి కారణం మేమా అని బండి సంజయ్‌ అన్నారు. ఇది పార్టీ ల సమస్య కాదు… రైతుల సమస్య…కలిసి రైతులను ఆదుకుందామని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.రాష్ట్ర సమస్యల పై పోరాటం చేస్తాం… ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తు న్నాం రైతు బంధుతో ఎక్కువ అప్పులు అవుతున్నాయని రైతులు అంటున్నారు.తెలంగాణ కు కేంద్రం అన్యాయం చేయదు. ఇబ్బంది వస్తే కేంద్రం దగ్గరికి వెళ్తాం అని బండి సంజయ్‌ అన్నారు.

Related Articles

Latest Articles