శ్రీవారి సుప్రభాతసేవలు ఎందుకు నిలిపేశారు?

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి గురించి ప్రసార మాధ్యమాల్లో వచ్చే కార్యక్రమాలకు, ప్రత్యక్ష ప్రసారాలకు ఎంతో ప్రాధాన్యత వుంటుంది. అయితే శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పేలా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం చేస్తూన్న సుప్రభాత సేవ కైంకర్యాల ప్రత్యక్షప్రసారాలను ఎందుకు నిలిపివేసారు అని నిలదీశారు బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఏడాది ముందుగానే అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలన్నారు.

ఆల్ ఇండియా రేడియా యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న శ్రీవారి భక్తులు స్వామివారి పూజా కైంకర్యాలను వింటున్నారని, వెంటనే వీటిని పునరుద్దరించాలని ఆయన కోరారు. శ్రీవారికి సంబంధించి ఏ కార్యక్రమానికైనా ఆదరణ వుంటుంది. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.

Related Articles

Latest Articles