జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించిన బీజేపీ.. లిస్ట్‌లో ఈటల !

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ప్రకటించారు. ఈ జాబితాలో తెలంగాణ నుండి జాతీయ కార్యవర్గం లో కొత్త వారికి చోటు దక్కింది. అంతేకాదు తెలంగాణ నుండి ఎక్కువ మంది కి అవకాశం దక్కింది. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఏకంగా నలుగురికి చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఇద్దరికి అవకాశం దక్కింది. కార్యవర్గ సభ్యులు గా కిషన్ రెడ్డి, గరిక పాటి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి (కిషన్ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు కొత్తవారే) ఎంపిక కాగా… ప్రత్యేక ఆహ్వానితులుగా విజయ శాంతి, ఈటల రాజేందర్(ఇద్దరు పార్టీలో కొత్తగా చేరిన వారే) ఎంపిక అయ్యారు. అలాగే… జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ స్థానం దక్కించుకోగా.. తమిళనాడు సహా ఇంచార్జ్ గా పొంగులేటి సుధాకర్ రెడ్డి నియామకం అయ్యారు. జాతీయ జాతీయ కార్యవర్గం లో లక్ష్మణ్, మురళీ ధర్ రావు, కిషన్ రెడ్డి మినహా మిగిలిన వారందరూ కొత్తగా పార్టీ లో చేరిన వారే కావడం విశేషం.

-Advertisement-జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించిన బీజేపీ.. లిస్ట్‌లో ఈటల  !

Related Articles

Latest Articles