అదిత్ అరుణ్ కు బర్త్ డే విషెస్!

జెనీలియా నాయిక‌గా న‌టించిన క‌థ‌ చిత్రంతో 2009లో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అదిత్ అరుణ్. అప్ప‌టి నుండీ రొటీన్ కు భిన్న‌మైన క‌థ‌ల‌నే ఎంపిక చేసుకుంటూ ఇటు తెలుగు, అటు త‌మిళ చిత్రాల‌లో న‌టిస్తున్నాడు. వీకెండ్ ల‌వ్, తుంగ‌భ‌ద్ర‌, గ‌రుడ‌వేగ‌ చిత్రాల‌తో పాటు 24 కిసెస్, చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు సినిమాల‌తో కుర్ర‌కారుకూ ద‌గ్గ‌ర‌య్యాడు ఈ యంగ్ హీరో. మ‌న ముగ్గురి ల‌వ్ స్టోరీ, లెవ‌న్త్ అవ‌ర్ వంటి తెలుగు వెబ్ సీరిస్ ల‌లోనూ న‌టించాడు. జూన్ 8 అదిత్ అరుణ్ జ‌న్మ‌దినం. ఈ సంద‌ర్భంగా అత‌ను న‌టిస్తున్న సినిమాల ద‌ర్శ‌క నిర్మాత‌లు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌చేశారు. ఇందులో ఒక‌టైన‌డియ‌ర్ మేఘ‌ చిత్ర యూనిట్ మోష‌న్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. మేఘా ఆకాశ్ నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాను అరుణ్ దాస్య‌న్ నిర్మిస్తుండ‌గా సుశాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. అలానే కె.వి. గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అదిత్ అరుణ్ డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ మూవీలో న‌టిస్తున్నాడు. ఇందులో రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివానీ నాయిక‌గా న‌టిస్తోంది. ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీని ర‌వి పి రాజు దాట్ల నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర యూనిట్ సైతం అరుణ్ అదిత్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విషెస్ తెలుపుతూ ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. అలానే అదిత్, పూజిత పొన్నాడ జంట‌గా న‌టిస్తున్న క‌థ కంచికి మ‌నం ఇంటికి మూవీ యూనిట్ సైతం మోష‌న్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ఈ చిత్రాన్ని చాణ‌క్య చిన్న ద‌ర్శ‌క‌త్వంలో మోనిష్ ప‌త్తిపాటి నిర్మిస్తున్నాడు. మొత్తానికీ ఈ సినిమాల‌న్నీ కూడా థియేట‌ర్ల ఓపెన్ కాగానే వ‌రుస‌గా సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-