బీచ్ లో బర్త్ డే గర్ల్ బికినీ ట్రీట్

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా దిశ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. అందులో దిశ బికినీ ధరించి బీచ్ దగ్గర కూర్చుని ఉంది. బర్త్ డే సందర్భంగా ఇచ్చిన హాట్ ట్రీట్ కు ఆమె అభిమానుల నుంచి లైకులు వర్షం కురుస్తోంది. ఇందులో పింక్ బికినీలో కన్పించిన దిశ ఈ పిక్ కు ఫ్లవర్స్ ఎమోజిని జత చేసింది. ఈ పిక్చర్ పర్ఫెక్ట్ షాట్ ను దిశా ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సాధారణంగానే చిట్టి పొట్టి దుస్తుల్లో నెటిజన్లకు నిద్ర లేకుండా చేసే దిశ… ఈ రోజు కూడా స్పెషల్ ట్రీట్ ఇచ్చేసింది. కాగా ఈ హాట్ బ్యూటీ ఇటీవలే సల్మాన్ సరసన నటించిన “రాధే”తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి విభిన్న స్పందన వచ్చింది. ఇక ఈ అందాల రాశి తెలుగు ప్రేక్షకులకు ఇంతకు ముందే పరిచయం ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన “లోఫర్” చిత్రంలో నటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో దిశకు తెలుగులో మళ్ళీ అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్లో ఈ భామ కు మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటో షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు పట్టకుండా చేస్తోంది. మరోవైపు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం అంటూ ఆమెపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాము ఇద్దరం స్నేహితులం మాత్రమేనని దిశ, టైగర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం వాళ్ళిద్దరూ లవ్ బర్డ్స్ అని ఫిక్స్ అయిపోయారు. మొత్తానికి దిశ బర్త్ డే రోజున కూడా బికినీ ట్రీట్ తో వార్తల్లో నిలవడం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-