అమెరికాలో మ‌రో ఉద్య‌మం…ప‌క్షుల‌ను చంపొద్దంటూ ర్యాలీలు…

అమెరికాలో మ‌రో ఉద్య‌మానికి ఊపిరి పోసుకున్న‌ది.  ప‌క్షుల‌ను చంపొద్ద‌ని అంటూ వేలాదిమంది రోడ్ల‌మీద‌కు వ‌చ్చి నినాదాలు చేస్తున్నారు.  బ‌ర్డ్ ఆర్ నాట్ రియ‌ల్ అనే పేరుతో ఉద్య‌మం జ‌రుగుతున్న‌ది.  అమెరికా వీధుల్లో ఎరుగుతున్న ప‌క్షులు నిజం కావ‌ని, నిజ‌మైన ప‌క్షుల‌ను అధికారులు చంపేస్తున్నారని, ఇప్ప‌టికే ల‌క్ష‌లాది ప‌క్షుల‌ను చంపేసి వాటి స్థానంలో రోబొటిక్ ప‌క్షుల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని, ఆ ప‌క్షులు అమెరిక‌న్ల జీవ‌నాన్ని గ‌మ‌నిస్తున్నాయని ఆందోళ‌న‌లు చేస్తున్నారు.  బ‌ర్డ్ ఆర్ నాట్ రియ‌ల్ అనే సిద్ధాంతం ఇప్పుడు మొద‌లైంది కాదు.  1950 నుంచే దీనిపై ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి.

Read: సల్మాన్ అవుట్… హృతిక్ ఇన్…!!

 అమెరిక‌న్ సీక్రెట్ ఏజెన్సీ దేశ‌వ్యాప్తంగా నిఘాను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.  నిఘాకోసం నిజ‌మైన ప‌క్షులు మాదిరిగా ఉండే రోబొటిక్ ప‌క్షుల‌ను త‌యారు చేసి వాటితో నిఘాను ఏర్పాటు చేయాల‌ని ఉద్దేశం.  అయితే, దీనిపై మ‌రో వాద‌న కూడా ఉన్న‌ది.  అప్ప‌ట్లో అధికారుల ఖ‌రీదైన కార్ల‌పై ప‌క్షులు రెట్ట‌లు వేస్తున్నాయ‌ని, అందుకే నిజ‌మైన ప‌క్షుల‌ను చంపి వాటి స్థానంలో రోబొటిక్ ప‌క్షుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌నే వాద‌న‌లు కూడా ఉన్నాయి.  అయితే, ఇందులో ఏది నిజం అనే మాట ఎలా ఉన్నా, బ‌ర్డ్ ఆర్ నాట్ రియ‌ల్ అనే వాద‌న బ‌లంగా వినిపిస్తున్న‌ది.  ఈ వాద‌న‌ను బ‌లంగా న‌మ్ముతూ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేక‌మైన పేజీలు, గ్రూపులు క్రియోట్ అయ్యాయి.  ల‌క్ష‌లాది మంది ఫాలోవ‌ర్లు ఫాలో అవుతున్నారు.  ప్ర‌స్తుతం లాక్‌డౌన్ ఆంక్ష‌లు స‌డ‌లించ‌డంతో మిస్సోరిలోని స్ట్రింగ్‌ఫీల్డ్‌లో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు రోడ్ల‌మీద‌కు వ‌చ్చి నిర‌స‌న‌లు తెలియ‌జేశారు. ప‌క్షుల‌ను చంపొద్ద‌ని, ప్ర‌జ‌ల జీవ‌నానికి భంగం క‌లిగించొద్ద‌ని నిర‌స‌న‌లు తెలియ‌జేశారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-