అమెరికాలో దారుణంః అంతుచిక్క‌ని వ్యాధితో ప‌క్షులు మ‌ర‌ణం…

క‌రోనా నుంచి ప్ర‌పంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న త‌రుణంలో అమెరికాను మ‌రో స‌మ‌స్య ఇబ్బందులు పెడుతున్న‌ది.  అంతుచిక్క‌ని వ్యాధితో ప‌క్షులు మ‌ర‌ణిస్తున్నాయి.  వైర‌స్ కార‌ణంగా ప‌క్షులు మ‌ర‌ణిస్తున్నాయ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నా, వ్యాధికి కార‌ణాలు ఎంటి అన్న‌ది ఇంకా తెలియ‌లేద‌ని, ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని వాషింగ్ట‌న్‌లోని జంతుప‌రిర‌క్ష‌ణ అధికారులు చెబుతున్నారు.  ప‌క్షి క‌నుగుడ్లు ఉబ్బి, ప‌ట్టుకొల్పోయి మ‌ర‌ణిస్తున్నాయ‌ని, ఇలాంటి కేసు మొద‌ట ఏప్రిల్ నెల‌లో గుర్తించిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  

Read: బాలీవుడ్ మూవీ ప్రారంభించిన నాగ చైతన్య

అయితే, జూన్ నెల నుంచి ఇలాంటి మ‌ర‌ణాల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌ని, ఇప్ప‌టికే ఇలాంటి అంతుచిక్క‌ని వ్యాధితో అనేక ప‌క్షులు మ‌ర‌ణిస్తున్నాయిని జంతుసంర‌క్ష‌ణ అధికారులు పేర్కొన్నారు.  గ‌తంలో ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని అధికారులు అంటున్నారు.  ఒక్క వాషింగ్ట‌న్ లో మాత్ర‌మే కాకుండా అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు న‌మోదైన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-