బార్బేరియన్ రాజుగా కళ్యాణ్ రామ్… “బింబిసారా” గ్లిమ్ప్స్

యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం “బింబిసారా”. నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఇది కళ్యాణ్ రామ్ కు 18వ చిత్రం. కత్తిని పట్టుకుని కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో, గెటప్ లో కన్పించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మృతదేహాల సమూహంపై కూర్చుని ఉన్న కళ్యాణ్ మేక్ఓవర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. టైం ట్రావెల్ తో తెరకెక్కనున్న ఈ సోషల్ ఫాంటసీలో భారీ విఎఫ్ఎక్స్ తో ప్రేక్షకులకు మంచి థ్రిల్ కలిగించనున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో మల్లిడి వశిస్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ క్రింద హరికృష్ణ కె ‘బింబిసారా’ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-