శీతాకాల సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లులు

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తానన్న తన వాగ్దానాన్ని త్వరగా నెరవేర్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రివర్గం తెలిపింది. దీనికి సంబంధించి ‘ది ఫార్మ్ లాస్ రిపీల్ బిల్లు, 2021’ ఆమోదం కోసం తీసుకోనుంది. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి లోక్‌కల్యాణ్‌ మార్గ్‌ నివాసంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశం కానుంది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకో వడానికి ఒక సమగ్ర “రద్దు బిల్లు” మాత్రమే తీసుకురావచ్చని తెలు స్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ముందు గా లోక్‌సభలో రద్దు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021 గత సంవత్సరం చట్టంగా ఆమోదించబడిన మూడు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోడీ ప్రకటన చేసిన విషయం తెల్సిందే.

రైతుల ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ మరియు సులభతరం) చట్టం, 2020, ధరల హామీ మరియు వ్యవసాయ సేవల చట్టంపై రైతుల (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం , 2020 ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020. ఈ మూడు బిల్లుల ను ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి వెనకకు తీసుకోవాలని భావిస్తున్నట్టు కేంద్రం యోచిస్తుంది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రధా నంగా పంజాబ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ మరియు హర్యానా నుండి రైతు లు గత ఏడాది కాలంగా నిరసనలు చేపడుతున్న సంగతి విధితమే. ఈ చారిత్రాత్మక నిర్ణయం పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles