మాజీ సీఎం సదానంద్ సింగ్ కన్నుమూత

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, బీహార్ మాజీ సీఎం.. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడుగా ఉన్న సదానంద్ సింగ్ కన్నుమూశారు… ఆయన బుధవారం ఉదయం మృతిచెందినట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించారు.. ఇక, బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలోని కహల్‌గావ్ అసెంబ్లీ స్థానం నుంచి సదానంద్ సింగ్… తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సదానంద్ సింగ్ 2000 నుండి 2005 వరకు బీహార్ శాసనసభ స్పీకర్‌గా కూడా ఉన్నారు. అంతకుముందు అతను బీహార్ నీటిపారుదల మరియు ఇంధన మంత్రిగా పనిచేశారు. సదానంద్ సింగ్ మరణానికి సంతాపం తెలుపుతూ బీహార్ కాంగ్రెస్ చీఫ్ మదన్ మోహన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఒక రాజకీయ శకం ముగిసింది అని పేర్కొన్నారు.. బీహార్‌లో ప్రసిద్ధ నాయకుడు, కాంగ్రెస్ యోధుడు, సదానంద్ సింగ్ జీ ఈరోజు తుదిశ్వాస విడిచారు.. ఒక రాజకీయ శకం ముగిసింది. మీ నవ్వుతున్న ముఖం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు..

బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరియు హిందుస్తానీ అవామ్ మోర్చా నాయకుడు జితన్ రామ్ ట్వీట్ చేస్తూ.. ఈ రోజు నా పాత స్నేహితుడు నన్ను విడిచిపెట్టాడు.. సదానంద్ బాబు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఇక, ఆర్డీజే నేత తేజశ్వి యాదవ్.. సదానంద్ సింగ్ మరణానికి సంతాపం తెలిపారు.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మరియు మాజీ మంత్రి శ్రీ సదానంద్ సింగ్ జీ మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.. అతనికి సుదీర్ఘ సామాజిక-రాజకీయ అనుభవం ఉంది. అతను నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-