“బిగ్ బాస్” తెలుగు ఓటిటి వెర్షన్ రెడీ ?

“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో లాంచ్ ఎపిసోడ్‌కు మంచి టీఆర్పీ రేటింగ్ కూడా వచ్చింది. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇతర షోలన్నింటినీ పక్కకు నెట్టేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు త్వరలో తొలి ఓటిటి వెర్షన్‌ రానున్నట్లు వినికిడి. ప్రస్తుతం సాగుతున్న “బిగ్ బాస్ సీజన్ 5” ఈ ఏడాది చివరి వారంలో ముగుస్తుంది. మేకర్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఓటిటి వెర్షన్‌ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Read Also : కనికరించండి… ఏపీ సీఎంకు చిరు రిక్వెస్ట్

ఈ ఓటిటి వెర్షన్ ఆరు వారాల పాటు నడుస్తుంది. వివిధ వృరంగాల ప్రముఖులు ఈ షోలో భాగం కానున్నారు. ఓటిటి వెర్షన్ ఫైనలిస్టులలో ఒకరు టెలివిజన్ వెర్షన్, అంటే “బిగ్ బాస్ సీజన్ 6″లోకి నేరుగా ప్రవేశం పొందుతారు. వార్తల ప్రకారం “బిగ్ బాస్ తెలుగు సీజన్ 6” వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో ప్రారంభమవుతుంది. ఓటిటి వెర్షన్ కు ప్రేక్షకులు ఎక్కువ సేపు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సిరీస్‌కు మరింత ఆదాయం, ఎక్కువ వినోదం, మంచి ప్రజాదరణ లభిస్తుంది. తేకాకుండా టెలివిజన్ వెర్షన్‌లోకి ఓటిటి పోటీదారుల ప్రవేశం అనేది మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఓటిటి వెర్షన్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

ఇదే ఫార్ములా హిందీలో విజయవంతం కావడంతో తెలుగు మేకర్స్ కూడా దానిని ఫాలో కాబోతున్నారు. బిగ్ బాస్ హిందీ ఓటిటి వెర్షన్ ఆగస్టులో ప్రారంభమై నిన్న రాత్రి పూర్తయ్యింది. దివ్య అగర్వాల్ ఓటిటి వెర్షన్ విజేతగా నిలిచింది. ఆమెకు ప్రైజ్ మనీగా రూ. 25 లక్షలు అందించారు. కరణ్ జోహార్ ఈ ఓటిటి వెర్షన్‌ను హోస్ట్ చేసారు. టెలివిజన్ వెర్షన్‌కు మాత్రం సల్మాన్ హోస్ట్‌గా ఉంటారు. మరి తెలుగులో నాగార్జున ఓటిటి వెర్షన్‌ని హోస్ట్ చేస్తాడా? లేదా మేకర్స్ మరో ప్రముఖుడిని హోస్ట్ గా పరిచయం చేస్తారా అనేది చూడాలి.

-Advertisement-"బిగ్ బాస్" తెలుగు ఓటిటి వెర్షన్ రెడీ ?

Related Articles

Latest Articles