బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం బయటకు వెళ్ళేది ఏ మాస్టర్!?

ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం నామినేషన్స్ లో ఏకంగా ఎనిమిది సభ్యులు ఉన్నారు. ఇందులో ఆర్జే కాజల్, ప్రియ నామినేట్ కావడం ఇది మూడోసారి. కాజల్ వరుసగా మొదటి రెండు వారాలు నామినేట్ అయ్యి సేఫ్ గా బయటపడింది. ఇప్పుడు మూడోసారి నామినేషన్స్ లో ఉంది. ఇక ప్రియ రెండు, మూడు వారాలలో నామినేషన్ అయ్యి సేవ్ అయ్యింది. నాలుగోవారం మూడోసారి నామినేషన్స్ లో ఉంది. ఆమెకూ ప్రేక్షకుల నుండి సాలీడ్ ఓట్లు పడుతున్నాయని సేవ్ అయిన విధానం చెబుతోంది.

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రవి… మొదటి వారం తర్వాత మళ్ళీ ఇప్పుడు నామినేట్ అయ్యాడు. అయితే… నామినేషన్స్ సమయంలోనే అతను తన మనసులోని సంఘర్షణను బయట పెట్టడంతో అతని పట్ల వ్యూవర్స్ సానుభూతిని ప్రదర్శించే ఆస్కారం ఉంది. ఇక సిరి, సన్ని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళ ఆటకు వ్యూవర్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో… మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చిన వీరికి ఓట్లు బాగానే పడే ఛాన్స్ ఉంది.

ఇక మిగిలింది లోబోతో పాటు డాన్స్ మాస్టర్స్ నటరాజ్, యానీ నే! బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి లోబో తన ఆరోగ్యం సహకరించినా, సహకరించకపోయినా… ఏదో రకంగా హౌస్ మేట్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వారం కాస్తంత సంయమనం కోల్పోయినా, బహుశా ఒకటి రెండు రోజుల్లో అతను రైట్ ట్రాక్ మీదకు వచ్చే ఛాన్స్ ఉంది. పైగా లోబో కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా, మరికొన్ని వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతాడనిపిస్తోంది. ఇక మిగిలింది… యానీ అండ్ నటరాజ్ మాస్టర్లే! నిజానికి వీరిద్దరూ ఏ గ్రూప్ లోనూ లేకుండా ఇండిపెండెంట్ గా ఆడుతున్నారు. వీరిలో అందరితో కలిసిపోతూ సేఫ్ గేమ్ ఆడుతోంది యాని మాస్టరే! ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్యను వదిలేసి వచ్చినందుకు నటరాజ్ మాస్టర్ కొంత డిస్ట్రబ్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. దాంతో ఈ వారం ఆయన ప్రవర్తన ట్రాక్ తప్పిందనేది తెలిసిపోతోంది. ఆ రకంగా చూసినప్పుడు యాని మాస్టర్ కంటే హౌస్ నుండి బయటకు వెళ్ళే ఛాన్స్ నటరాజ్ మాస్టర్ కే ఎక్కువ ఉండే ఆస్కారం ఉంది. అయితే… బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకూ ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు. విశ్లేషకుల అంచనాలు ఎలా ఉన్నా… బిగ్ బాస్ కు తన లెక్క తనకుంటుంది. చూద్దాం ఈ వీకెండ్ ఏం జరుగుతుందో!!

-Advertisement-బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం బయటకు వెళ్ళేది ఏ మాస్టర్!?

Related Articles

Latest Articles