ఈ సారి ‘బిగ్ బాస్’కి ఒకరు కాదు… ఇద్దరు హోస్టులా?

బిగ్ బాస్ షోతో సల్మాన్ అనుబంధం చాలా ఏళ్లుగా నుంచీ కొనసాగుతోంది. అయితే, రానున్న బిగ్ బాస్ సీజన్ లో సల్మాన్ కి బదులు మరోకరు హోస్ట్ గా రాబోతున్నారా? ‘వూట్’ ఓటీటీ నుంచీ వస్తోన్న సమాచారం చూస్తే అలాగే అనిపిస్తోంది.

బిగ్ బాస్ నిర్వాహకులు తమ రియాల్టీ షోని మరింత సుదీర్ఘంగా నడిపేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారట. అందులో భాగంగా ‘బిగ్ బాస్ ఓటీటీ’ షోని మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్త ఫార్మాట్ లో మొదట కొన్ని వారాలు కంటెస్టెంట్స్ ఓటీటీలో కనిపిస్తారు. ‘వూట్’లో కొంత వరకూ షో జరిగిపోయాక టీవీలో కూడా ప్రసారం అవటం మొదలవుతుంది! అంటే ఓటీటీ స్క్రీన్ తరువాత టెలివిజ్ స్క్రీన్ పై కంటిన్యూ అవుతుందన్నమాట! కాకపోతే, ‘మీకో సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్’ అంటూ బిగ్ బాస్ నిర్వాహకులు రీసెంట్ గా ట్వీట్ చేశారు. అందులో అసలు విషయం చెప్పలేదుగానీ ‘సిడ్ నాజ్’ అనే హ్యాష్ ట్యాగ్ వాడుతూ త్వరలోనే ‘ధమాకేదార్ న్యూస్’ ఉంటుందని ఊరించారు!

‘సిడ్ నాజ్’ అంటే… బిగ్ బాస్ 13 కంటెస్టెంట్స్ సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్. వారిద్దరి జంట అప్పట్లో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. సొషల్ మీడియాలో లక్షలాది మందికి సిద్ధార్థ్, షెహనాజ్ హాట్ ఫేవరెట్స్ అయ్యారు. లెటెస్ట్ గాసిప్ ప్రకారం… ‘సిడ్ నాజ్’ జంట బిగ్ బాస్ ఓటీటీ షోని హోస్ట్ చేస్తారట. మరి టీవీలో బిగ్ బాస్ ని ఎవరు కంటిన్యూ చేస్తారు? సల్మాన్ ఎప్పటిలాగే బిగ్ బాస్ పాత్రలోకి వచ్చేస్తాడా? లేక బిగ్ బాస్ ఓటీటీ కోసం ఎంపికైన ‘కొత్త జంటే’ బుల్లితెరపై కూడా హోస్ట్ చేస్తారా? అదే జరిగితే… బిగ్ బాస్ నుంచీ సల్మాన్ అవుటైపోయినట్టే! లెట్స్ వెయిట్ అండ్ సీ…

ఈ సారి ‘బిగ్ బాస్’కి ఒకరు కాదు… ఇద్దరు హోస్టులా?
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-