బిగ్ బాస్ – 5 : చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు?

రియాలిటీ షో “బిగ్ బాస్-5” ఇంకా రెండు వారాలు మిగిలి ఉంది. గత వారం హౌస్ లో నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కాగా, మిగిలిన ఆరుగురు హౌస్‌మేట్స్‌లో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు. సింగర్ శ్రీరామచంద్ర ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకున్నారన్న విషయం తెలిసిందే. ఈ వారానికి గానూ నామినేషన్ లో శ్రీరామ్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులందరూ ఉన్నారు. దీంతో చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు ఉన్నారు? అనే విషయంపై బుల్లితెర ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది. శ్రీరామ్ ను పక్కన పెడితే సన్నీ, షణ్ముఖ్‌లకు మంచి ఓటింగ్ ఉండడంతో టాప్ 2 కంటెస్టెంట్లుగా ఉంటారు. దీంతో సిరి, కాజల్, మానస్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తాజా టాక్ ప్రకారం ఈ ముగ్గురు హౌస్ మేట్స్ లో ఓట్ల ప్రకారంగా కాజల్ కు చాలా తక్కువ ఓటింగ్ నమోదు అవుతోంది.

Read Also : “ఆర్ఆర్ఆర్” కొత్త ప్రోమో… ట్రైలర్ పై అంచనాలను పెంచేస్తున్న టీమ్

అయితే ఇప్పుడు ప్రేక్షకుల మదిలో బిగ్ బాస్ కాజల్‌ను కాపాడుతారా? అనే ప్రశ్న మెదులుతోంది. ఎందుకంటే ప్రతి సీజన్‌లో కొంత మంది కంటెస్టెంట్స్‌కి బిగ్ బాస్ టీమ్ కొంత మేలు చేస్తుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. సీజన్ 3లో వారు పునర్నవిని చాలాసార్లు కాపాడారు. సీజన్ 4లో మోనాల్, సోహైల్‌లను కూడా సేవ్ చేశారు. ప్ర‌స్తుత సీజ‌న్‌లో బిగ్ బాస్ ఓటింగ్ ప్ర‌కారం ఈ వారం కాజ‌ల్‌ని పంపిస్తారా ? లేక మాన‌స్‌ని బ‌లి చేస్తారా ? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ప్రస్తుతం ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో ఉండడంతో బిగ్ బాస్ ఫైనల్‌లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉండాలని మేకర్స్ గనుక భావిస్తే, ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఈ వారం మానస్ ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయం. మరి ఈ వారం బిగ్ బాస్ టీమ్ ఎవరిని ఎలిమినేట్ చేస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles