ఆర్జే కాజల్ ను కార్నర్ చేస్తోంది ఎవరు!?

బిగ్ బాస్ సీజన్ 5 రెండో రోజుకే కంటెస్టెంట్స్ మధ్య రచ్చ మొదలైపోయింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మానేసి అసహనం ప్రదర్శించడం మొదలెట్టేశారు. ఇక మొదటి వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ఆరుగురి (సరయు, జస్వంత్, రవి, హమీద, మానస్, కాజల్)లో రెండో రోజు ఫోకస్ మొత్తం ఇద్దరు, ముగ్గురి మీద ఉండటం విశేషం. నిజానికి ఈ ఆరుగురికి సంబంధించిన దిన చర్యలను ఎక్కువగా చూపించి ఉంటే… వ్యూవర్స్ కు వాళ్ళ మీద ఓ అంచనా ఏర్పడి సరైన వ్యక్తికి ఓటు వేసే ఆస్కారం ఉండేది. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన మర్నాడు అంటే మంగళవారం కెమెరా కన్ను, ఎడిటర్ల దృష్టి కేవలం కొందరి మీదనే ఉందన్నది వాస్తవం.

Read Also : బిగ్ బాస్ 5 : ఈ సీజన్లో ఆ ట్విస్ట్ లేనట్టేనా… మేకర్స్ షాకింగ్ నిర్ణయం ?

నామినేట్ అయిన ఆరుగురిలో కాస్తంత హైపర్ యాక్టివ్ గా ఉంటోంది ఆర్జే కాజలే! దానికి కారణం కూడా ఆమె బిగ్ బాగ్ హౌస్ లోకి ఎంటర్ అయిన ఫస్ట్ డేనే చెప్పేసింది. కల నిజమైనట్టుగా ఉందని, అందుకనే తనలోని హైపర్ యాక్టివ్ నెస్ ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని నిజాన్ని ఒప్పేసుకుంది. కానీ రెండో రోజు ఆమె హైపర్ యాక్టివ్ నెస్… కొందరికి డామినేషన్ లా కనిపించింది. దాంతో ఇతర కంటెస్టెంట్స్ కాస్తంత ఇబ్బంది పడ్డారు. మిగిలిన వాళ్ల సంగతి పక్కన పెడితే, లహరి మాత్రం ఏ మాత్రం ఈ డామినేషన్ ను టోలరేట్ చేయనని ముఖం మీదే చెప్పేసింది. దాంతో కాజల్ మౌనం వహించినా, లహరి రెచ్చిపోయి…. తన విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉంది. ఒకానొక దశలో దానిని తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్న కాజల్… ఇలా తనని కూతురు చూస్తే తట్టుకోలేదంటూ ఆపుకునే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో కాస్తంత హైపర్ యాక్టివ్ గానే నువ్వు బిహేవ్ చేస్తున్నావ్ అని రవి డైరెక్ట్ గా కాజల్ కే చెప్పడం విశేషం. అలా చెప్పడంతో కాజల్ ను అతను కార్నర్ చేసినట్టు అయిపోయింది. అలాంటిదే జరిగి ఉంటే… కంట్రోల్ చేసుకుంటానని కాజల్ బదులిచ్చింది. అయితే… ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిలో కాజల్ తో పాటు జెస్పీ, రవి, మానస్ మీదనే రెండో రోజు బిగ్ బాస్ ఫోకస్ చేశాడు. సిగరెట్ స్మోకింగ్ గర్ల్ సరయు, హమిద పెద్దంత ఫోకస్ కాలేకపోయారు. మరి వచ్చే రెండు మూడు రోజుల్లో వాళ్ల యాక్టివిటీస్ ను బిగ్ బాస్ హైలైట్ చేస్తాడేమో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-