బిగ్ బాస్ 5 : ఈ వారం టార్గెట్ ఉమా ?

బిగ్ బాస్ 5 మొదటి వారంలో ఎలిమినేషన్ లో భాగంగా సరయూను బయటకు పంపించేశారు. ఈ వారం టార్గెట్ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఉమా అంటున్నారు. ఈ వారం నామినేషన్లలో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఉన్నారు. అయితే మొదటి వారం నామినేషన్ల లో లేని ఉమాపై ఈ వారం మాత్రం రంగు పడింది. దీంతో ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఉమా అని అంటున్నారు. దానికి ముఖ్య కారణం ఆమె ప్రవర్తనే. సీనియర్ ను అనే ఆమె పొగరు, మాట తీరు, నాన్ వెజ్ రచ్చ కారణంగా ఆమెతో ఇంట్లో ఎవరూ సరిగ్గా మెలగలేకపోతున్నారు.

Read Also : ఒక్క దోశ అతని జీవితాన్ని మార్చేసింది… “పుష్ప”రాజ్ మంచి మనసు

ఇతరులపై బలవంతంగా ఆధిపత్యాన్ని చెలాయించాలనే తత్వం, నామినేషన్ల సమయంలో ఆమె అసభ్యకర కామెంట్స్ చేయడం ప్రేక్షకులకు రుచించడం లేదు. ముఖ్యంగా ఈ షో కుటుంబ సమేతంగా చూసేది అనే విషయాన్ని కంటెస్టెంట్లు మర్చిపోతున్నారు. ఈసారి గ్లామర్ షో మరీ ఎక్కువైంది. అంతేనా మాటల ఘాటు కూడా ఎక్కువగానే ఉంది. కుటుంబ సమేతంగా చూసే షోలో ఇలాంటి అసభ్యకర పదాలను వాడడమే ఆమెను ఇంటి నుంచి తరిమేయాలని ప్రేక్షకులు అనుకోవడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు.

అంతే కాకుండా ఇంతకుముందు సీజన్లలో కూడా సీనియర్ల డామినేషన్ ను కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఏమాత్రం సహించలేదు. హేమ, కరాటే కళ్యాణి విషయంలో ఇది చాలా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు అలా నామినేషన్ లోకి వచ్చారో లేదో ఇలా ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉమా విషయంలో కూడా ఇదే జరుగుతుందని నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. మరి ఉమను ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ లో ఉంచుతారా ? లేదా ? తెలియాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే !

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-