తారాస్థాయికి చేరిన ‘పంతం – నీదా నాదా’!

బిగ్ బాస్ హౌస్ లో 8వ రోజు నామినేషన్స్ జరగడంతో… ఆ రాత్రి దాదాపు 12.45 వరకూ కంటెస్టెంట్స్ మెలుకువగానే ఉన్నారు. ఎవరు? ఎందుకు? ఎవరిని నామినేట్ చేశారనేది తెలుసుకునే ప్రయత్నం కొందరు చేశారు. రాత్రి బాగా పొద్దు పోవడంతో 9వ రోజు 9.45కు బిగ్ బాస్ సభ్యులను మేల్కొలిపాడు. అయితే ముందు రోజు నామినేషన్స్ సమయంలో జరిగిన గొడవల కారణంగా ఇటు కాజల్, అటు శ్వేత వర్మలకు కన్నీటితోనే తెల్లవారినట్టు అయ్యింది. మాటల మధ్యలో తాను గుంట నక్క అని సంబోధించింది ప్రియను గురించే అని నాటరాజ్ ఓపెన్ అయిపోయాడు. ఇక సన్ని కాజల్ తో క్లోజ్ గా మూవీ కావడం చూసి… అతను మాస్క్ తీయడం లేదంటూ ఆరోపించింది సిరి. ఈ వ్యవహారం కాస్తంత సద్దుమణిగాక, బిగ్ బాస్… ఆ రోజు గేమ్ ను మొదలెట్టాడు.

‘పంతం నీదా – నాదా’ అనే గేమ్ లో ఊల్ఫ్ టీమ్ తరఫున మానస్, ఈగల్ టీమ్ తరఫున శ్రీరామచంద్ర లీడర్స్ గా ఉన్నారు. గార్డెన్ ఏరియాలో రెండు టీమ్స్ కు సంబంధించి సమానమైన స్మాల్ సైజ్ పిల్లోస్ ను పెట్టారు. వాటిలో ఏ టీమ్ ఎక్కువ పిల్లోస్ ను చేజిక్కించుకుంటే వారే విజేత. అయితే ఈ గేమ్ లో ఒకరి స్మాల్ పిల్లోస్ ను మరొకరు లాక్కునే క్రమంలో సభ్యులకు బాగానే గాయాలయ్యాయి. ఎదుటి వ్యక్తి తమ నుండి పిల్లోని లాక్కోకుండా ఉండేందుకు చాలామంది టీ షర్ట్ లోపల దాచుకున్నారు. అయితే తోటి టీమ్ సభ్యుల సహకారంతో మీదపడి, దాడి చేసి మరీ టీ షర్ట్ లోని పిల్లోని వేరే వాళ్ళు లాగేసుకున్నారు.

నియమాలు, నిబంధనలు అంటూ లేకుండా సాగిన ఈ ‘పంతం నీదా – నాదా’ గేమ్ ను చూస్తుంటే ఆటవికుల పోరాటంలానే అనిపించింది. బహుశా అందుకనే కావచ్చు ఇలాంటి షోస్ ను నిషేధించాలంటూ సీపీఐ నారాయణ వంటి నేతలు మీడియాలో మొత్తుకుంటున్నారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ, మీద పడుతూ ఆడిన టైమ్ లో లోబో సొమ్మసిల్లి పడిపోయాడు. దాంతో వైద్యం కోసం డాక్టర్ రూమ్ లోకి పంపారు. కాసేపటికి తిరిగి వచ్చిన లోబోకు సిగరెట్లు బంద్ చేయమంటూ తోటి వారు సలహా ఇవ్వడం కొసమెరుపు.

ఓవర్ ఆల్ గా ‘పంతం నీదా -నాదా’లో సిరి చాలా స్ట్రేటజీగా గేమ్ ప్లే చేసినట్టు అర్థమౌతోంది. సన్నీని కావాలని టార్గెట్ చేయడం, ఏదో రకంగా గేమ్ లో విన్ కావాలని ప్రయత్నించడం వ్యూవర్స్ కు తెలుస్తూనే ఉంది. అలానే కాజల్ – శ్రీరామచంద్ర మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ఈ గేమ్ టైమ్ లో మరింతగా బయట పడింది. ఊల్ఫ్ టీమ్ కు చెందిన కాజల్… ఈగల్ టీమ్ లీడర్ శ్రీరామచంద్రతో వాగ్వివాదానికి దిగినప్పుడు… ‘లీడర్ గా మానస్ మాట్లాడాలి తప్పితే నువ్వు కాదం’టూ తీవ్ర స్వరంతోనే ఆమెను హెచ్చరించాడు. ఇక బిగ్ బాస్ చెప్పిన రెండో గేమ్ ‘సాగరా… సోదరా’ మొదలు కాకముందే… తొమ్మిదో రోజు గడిచిపోయింది. ఈ రెండు గేమ్స్ లో విజేతలుగా నిలిచే టీమ్ లోంచి రెండో వారానికి కెప్టెన్ ఎంపిక జరుగుతుందని బిగ్ బాస్ సెలవిచ్చాడు. సో… అలా చూసినప్పుడు బుధవారం… సెకండ్ కెప్టెన్ ఎంపిక జరిగే ఆస్కారం ఉంది.

Related Articles

Latest Articles

-Advertisement-