బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే !

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5’ నాలుగవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వారం షో కాస్త నెమ్మదించినట్టు అనిపించినా, వీకెండ్ నాగార్జున రావడంతో ఉత్సాహం మొదలైంది. అయితే గత మూడు వారాల నుంచి లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అవుతుండడంతో ఈసారి కూడా అలాగే జరుగుతుందా ? లేక ఈసారి ఎవరైనా అబ్బాయిలను బయటకు పంపిస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎనిమిది మంది పోటీదారులు సన్నీ, సిరి, రవి, కాజల్, లోబో, ప్రియా, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ కోసం ఈ వారం నామినేట్ అయ్యారు. అందులో సన్నీకి ‘బిగ్ బాస్’ వీక్షకుల నుండి అత్యధిక సానుకూల ఓట్లు వచ్చినట్లు నివేదికలు వస్తున్నాయి. సిరి, ప్రియ, రవి, కాజల్‌కు మంచి ఓట్లు వచ్చాయి. వారు సేఫ్ జోన్‌లో ఉన్నారు. యానీ మాస్టర్, లోబో, నటరాజ్ మాస్టర్‌లు చాలా తక్కువ ఓట్లు పొందుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు.

Read Also : ‘ఛీటర్స్’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్… ఆ సెటైర్ ఎవరిపై ?

వీకెండ్ అనగానే ఎలిమినేషన్… అయితే ప్రేక్షకుల్లో ముందుగానే ఆసక్తిని చంపేస్తూ ఎప్పటిలాగే లీక్స్ వస్తున్నాయి. గత మూడు వారాల నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో ముందుగానే లీకైనట్టుగా ఈ వారం కూడా లీకైంది. ఇప్పుడు ఈ వారం నటరాజ్ ‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

-Advertisement-బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే !

Related Articles

Latest Articles