బిగ్ బాస్ 5 : మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్

బిగ్ బాస్ 5 క్రమంగా ఆసక్తికరంగా మారుతోంది. ఇంతకుముందు సీజన్ల కన్నా ఈసారి కంటెస్టెంట్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశారు. బిగ్ బాస్ వేదికగా ఓటిటి ప్లాట్ పామ్ డిస్నీ+ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ అని ప్రకటించారు. పనిలో పనిగా చరణ్ ‘మాస్ట్రో’ సినిమా ప్రమోషన్స్ కూడా చేశారు. ఆ తరువాత గత వారం రోజుల్లో హౌజ్ లో హద్దు దాటి ప్రవర్తించిన కంటెస్టెంట్స్ కు అక్షింతలు వేశారు నాగార్జున. ఇక రెండవ వారం నామినేషన్ లో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, అన్నీ, ప్రియాంక, ప్రియ ఉండగా… లోబోను, ప్రియను సేఫ్ చేశారు.

Read Also : తండ్రి కాళ్ళకు దండం పెట్టి కన్నీళ్ళు పెట్టిన నాగార్జున!

మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయాన్నీ ఈరోజు వెల్లడించనున్నారు. కానీ షోలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయాన్ని ముందుగానే ప్రేక్షకులు తెలుసుకోగలుగుతున్నారు. “బిగ్ బాస్” లీక్స్ మొదటి వారం నుంచే మొదలయ్యాయి. మొదటివారం కూడా సరయు ఎలిమినేట్ అవుతుందని ముందుగానే తెలిసిపోయింది. ఇక ఇప్పుడు కూడా బిగ్ బాస్ మరో లేడీ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసిన విషయం నిన్ననే లీక్ అయ్యింది. రెండవవారం ఉమా దేవికి బైబై చెప్పేశారు. ఉమా దేవి ఇంట్లో అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారు. ఆమె ఇతరులతో తీరు కూడా హర్టింగ్ గా ఉండడం ప్రేక్షకులకు నచ్చలేదు.

-Advertisement-బిగ్ బాస్ 5 : మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్

Related Articles

Latest Articles