లోబో ఫ్రస్ట్రేషన్ కు కారణం ఏమిటీ!?

సోమవారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చూసిన వాళ్ళందరికీ ఒక్కటే అనుమానం! ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తుండే లోబోకు ఏమైంది? అని. ఎందుకంటే… నామినేషన్స్ సమయంలో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, మాటల దాడి చేయడం కామన్. కానీ హద్దు మీరి లోబో సోమవారం ప్రియను టార్గెట్ చేయడం, చిన్న విషయానికి ఆమెపైకి అరుస్తూ, కొట్టడానికే అన్నట్టుగా మీద మీదకు వెళ్ళడంతో చాలామందిని షాక్ కు గురిచేసింది. లోబో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక హౌస్ మేట్స్ సైతం అవాక్కయ్యారు. లోబో తన లవ్ స్టోరీ చెబుతుంటే… ప్రియా దానిని లైట్ తీసుకుని ఉండొచ్చు… అలానే ఏదైనా సెటైరిక్ గా మాట్లాడి ఉండొచ్చు. అందుకు హర్ట్ అయ్యి ప్రియను లోబో నామినేట్ చేయడంలో కూడా తప్పులేదు. కానీ తన ప్రేమను ఆమె కించపరిచిందన్నట్టుగా కలరింగ్ ఇవ్వడం, ఏదో ఘోరం తనకు జరిగిపోయిందన్నట్టుగా అతి ప్రవర్తించడం చాలామందికి చిత్రంగా అనిపించింది. ఒకానొక సమయంలో రవి లోబోకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ మిగిలిన హౌస్ మేట్స్ మౌనంగా ఉండి పోయారు. లోబో ఆవేశం, ఆక్రోశం… ఆపైన కన్నీళ్ళు పెట్టుకోవడం ఇదంతా ఓ డ్రామాలా చూసే వాళ్ళకూ అనిపించింది. నిజానికి ఇటు ప్రియను కానీ అటు సిరిని కానీ లోబో నామినేట్ చేయడానికి చెప్పిన కారణాలు గొప్పగా లేదు. అలా లోబో అందరిలో చులకన అయిపోవడమే కాకుండా… ఆ తర్వాత అతన్ని కొందరు ఇదే కారణంగా నామినేట్ చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు.

గత కొన్ని రోజులుగా లోబో ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తే ఒకటి అర్థం అవుతుంది. రీజన్ ఏదైనా… అతని ఆరోగ్యం కొంత సహకరించడం లేదు. దానికి తోడు బాగా సిగరెట్లు తాగే లోబో కొన్ని రోజులుగా ఆ విషయంలో నియంత్రణ పాటిస్తున్నాడు. నిజానికి నాగార్జున లోబోను పూర్తిగా సిగరెట్లు తాగడం మానేయమని చెప్పాడు. ఆ తర్వాత ఇటు లోబో, అటు హమీదా ఇద్దరూ స్మోక్ చేస్తున్నారా? లేదా? అనేది వ్యూవర్స్ కు తెలియదు. ఎందుకంటే వాళ్ళు స్మోక్ చేసే సీన్స్ వేటినీ బిగ్ బాస్ వ్యూవర్స్ కు చూపించలేదు. సో… ఒక్కసారిగా స్మోకింగ్ కు లోబో దూరం కావడంతో ఆ ఫ్రెస్ట్రేషన్ అంతా అతను తోటి ఇంటి సభ్యుల మీద చూపిస్తున్నాడేమో అనే భావన కలుగుతోంది. అలానే ప్రియాంక సైతం తనని లోబో ఒకానొక సమయంలో టచ్ చేసిన విధానం నచ్చలేదని స్పష్టంగా అందరి ముందు చెప్పింది. నిజానికి అందులో లోబో తప్పు లేకపోతే, ఖండించి ఉండాల్సింది. లేదా పొరపాటున అలా జరిగిందని అని ఉండాల్సింది. కానీ మౌనంగా ఉండటంలో ఆ టచ్చింగ్ కావాలని చేసిందనే భావన వ్యూవర్స్ కు కలుగుతుంది. ఇది లోబోకు మంచిది కూడా కాదు. ఏదేమైనా లోబో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని, తనను తాను సరిదిద్దుకుంటే మంచిది. లేకపోతే… ‘పాపం బస్తీ పోరగాడు’ అనే జాలి కూడా జనం అతని మీద చూపించరు.

-Advertisement-లోబో ఫ్రస్ట్రేషన్ కు కారణం ఏమిటీ!?

Related Articles

Latest Articles