పోసాని ఇంటిపై దాడి కేసులో కొత్త ట్విస్ట్

నటుడు పోసాని ఇంటిపై దాడి చేసిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నటుడు పోసాని ఇంటితోపాటు పక్కన ఉన్న సిసి కెమెరాలు పనిచేయడం లేదని పోలీసుల విచారణలో బయట పడింది. దాడి చేసిన వాళ్లని పట్టుకోవాలంటే సిసి కెమెరా ఫుటేజ్ తప్పనిసరైంది. అయితే పోలీసులు చెక్ చేయగా అతని ఇంటి చుట్టు పక్కల ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని బయటపడింది. దీంతో పోలీసులు ఆ ఏరియా మొత్తంలో పనిచేస్తున్న సీసీ కెమెరాలు పైన దృష్టి పెట్టారు.

టాలీవుడ్ నటుడు సినీ నటుడు పోసాని కృష్ణ మురళికు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న వారు నేపథ్యంలో పోసాని ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. నగరంలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని ఇంటిపై ద్విచక్ర వాహనంలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వినట్లు పోలీసులకు సూపర్‌వైజర్‌ పురుషోత్తం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పోసాని ఇంటిలో పనిచేస్తున్న ఇద్దరి భయాందోలనుకు గురై ఇంట్లో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు .. అసభ్య పదజాలంతో దూషిస్తూ రాళ్లు విసిరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడాలో నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్లదాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులుఎల్లారెడ్డి గూడలోని పోసాని ఇంటిపై రాళ్లదాడి చేసి పరారయ్యారు. అర్థరాత్రి ఇద్దరు గుర్తు దుండగులు పోసానిని బండ బూతులు తిడుతూ ఇంటిపై దాడిచేసినట్లు స్థానికులు చెప్పారు. ఈ దాడిలో పోసాని ఇంటి తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోసాని ఇంటి వాచ్‌మెన్ కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. గత ఎనిమిది నెలలుగా పోసాని కృష్ణ మురళి ఆ ఇంట్లో లేడని , తానూ గచ్చి బౌలి లో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు.. అయితే ఎల్లారెడ్డి గూడలో ఉంటున్న ఇల్లు కేవలం ఆఫీస్ అవసరాల కోసం తానూ వాడుతున్నట్లు వాచ్ మెన్ పోలీసులు కి స్టేట్మెంట్ ఇచ్చాడు..

పోసాని ఇంటి సూపర్‌వైజర్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా పోసాని ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో దుండగులు జన సేన , పవన్ కళ్యాణ్ అభిమానాలు ముసుగులో రాళ్ల దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇక సీసీ కెమెరాలు పరిశీలించగా పోసాని ఇంట్లో కానీ బయట పక్కనే ఉన్న ఇంటి సిసి కెమెరాలు పని చేయకపోవడంతో దాడి దృశ్యాలు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.. ఆ ఏరియాలో ఉన్న సిసి కెమెరాలు మొత్తం పరిశీలిస్తే రాత్రి సమయంలో ఆ ఏరియాలో హంగామా చేసిన యువకులు వివరాలు బయట పడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు..

ఇక పోసాని ఇంటిపై రాళ్లు దాడితో తమకు ఎలాంటి సంబందం లేదని తెలంగాణ జనసేన ప్రకటించింది.. ఉద్దేశ పూర్వకంగా జనసేనపై వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.. పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు వెనుక ఏపీ ప్రభుత్వం ఉందని తెలంగాణా జనసేన ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు.. పోసానిపై తాము పెట్టిన ఫిర్యాదును తీసుకోక పోవడం వెనుక అనుమానాలు ఉన్నాయని తెలిపారు.. తెలంగాణ నుండి పోసాని కృష్ణ మురళిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.. గతంలో పవన్ కళ్యాణ్ తెల్ల కాగితం లాంటి వాడని పోసాని వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు.. 2009 చిలుకులూరు పేట ప్రచారంలో పవన్ కళ్యాణ్ ను బ్రతిమాలి తీస్కొని వెళ్లాడని తెలిపారు.. పోసానిని కంట్రోల్ చేసే భాద్యత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు..

-Advertisement-పోసాని ఇంటిపై దాడి కేసులో కొత్త ట్విస్ట్

Related Articles

Latest Articles