తెలుగు అకాడమీ స్కాంలో రంగంలోకి ఈడీ !

తెలుగు అకాడమీ స్కాం పై విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతుంది. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ లో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని సిసిఎస్ పోలీసులు గుర్తించారు. మనీలాండరింగ్ తో పాటు హవాలా లావాదేవీలు జరిగిన నేపథ్యంలో దీనిపై విచారణ జరపాలంటూ సిసిఎస్ పోలీసులు ఈడి కి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఈడి అధికారులు వెంటనే కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు తెలుగు అకాడమీ నిధులను కొట్టేసి నిందితులు పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుకున్నరని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ,విజయవాడ గుంటూరు తో పాటు తిరుపతిలో ఆస్తుల కొనుగోలు చేశారని పోలీసులు బయటపడింది. ఈ నేపథ్యంలోనే సీపీఎస్ పోలీసులు నివేదిక మేరకు ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగుతోంది.

— రమేష్ వైట్ల

-Advertisement-తెలుగు అకాడమీ స్కాంలో రంగంలోకి ఈడీ  !

Related Articles

Latest Articles