మున్సిపల్ రిజల్ట్స్ : ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన కు బిగ్ షాక్.. !

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇవాళ పూర్తిగా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల కోలహలం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్ల ఫలితాల్లో వైసీపీ పార్టీ దుమ్ము దులుపుతోంది. దర్శి మినహా దాదాపు అన్ని మున్సిపాలటీలు వైసీపీ కైవసం అయినట్లు సమాచారం అందుతోంది. అయితే..ఈ ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతుంటే… ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనకు మాత్రం ఊహించని షాక్‌ తగిలింది. బుగ్గన రాజేంద్ర నాథ్‌ నివాసం ఉండే 15 వ వార్డులో వైసీపీ పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్‌ 114 ఓట్ల మెజార్టీ తో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు బేతం చెర్లలో సంబరాలు చేసుకుంటున్నాయి. బేతం చెర్లలో మొత్తం 20 వార్డులుండగా… వైసీపీ 14, టీడీపీ 6 వార్డుల్లో విజయం సాధించింది.

Related Articles

Latest Articles