సింగరాయకొండలో చీటింగ్‌. 14లక్షలు కాజేసిన మేనేజర్

ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్ళు అందిన అవకాశాన్ని ఉపయోగించుకుని దోచేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మణప్పురం గోల్డ్ లోన్ లో చేతివాటం ప్రదర్శించి 14 లక్షలు కాజేశాడో మేనేజర్. బంగారం తమకు అక్కరకు వస్తుందని మణప్పురంలో తనఖా పెట్టారు ఖాతాదారులు. అక్కడ పనిచేసే మేనేజర్ జోసఫ్ రాజ్ మోసానికి పాల్పడ్డాడు.

శఠగోపంపెట్టి ఖాతాదారులకు చెందిన 14 లక్షల మేర బంగారం నగలు ఎక్కువ మొత్తంలో లోన్‌గా తీసుకుని మోసం చేశాడు మేనేజర్ జోసఫ్ రాజ్. తక్కువ మోత్తంలో బంగారు ఆభరణాలను ఖాతాదారుల వద్ద తీసుకుని ఎక్కువ మొత్తంలో లోన్ల పేరిట సంస్థకు కుచ్చుటోపీ పెట్టాడా ప్రబుద్ధుడు. కస్టమర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జోనల్ బ్రాంచ్ మేనేజర్ నాగేశ్వరరావు పోలీసులకు విషయం తెలిపారు. ఈ భారీ మోసం ఆడిట్ లో బయటపడింది. జోసఫ్ రాజ్ పై స్దానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు డిస్ట్రిక్ బ్రాంచ్ మేనేజర్ నాగేశ్వరరావు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు సింగరాయకొండ పోలీసులు.

Related Articles

Latest Articles