తమిళ సినిమాల విడుదలలో భారీ మార్పులు!

తమిళనాడులోనూ థియేటర్లు తెరుచుకున్నాయి. అయినా భారీ బడ్జెట్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల విడుదల ఎప్పుడు అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అంతే కాదు ముందు అనుకున్నట్లు కాకుండా పెద్ద సినిమాల విడుదలలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ దీపావళి కానుకగా నవంబర్ 4 న విడుదల కావలసి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం క్రిస్మస్‌కు వాయిదా పడనుంది. ఇక దీపావళి కానుకగా శింబు నటించిన ‘మానాడు’, విక్రమ్ – ధృవ్ నటించిన ‘మహాన్’, విశాల్ – ఆర్య చేసిన ‘శత్రువు’ రానున్నాయట.
పొంగల్ కి రిలీజ్ కావలసి ఉన్న విజయ్ సినిమా ‘మృగం’ సమ్మర్ కి వాయిదా పడనుందట. అలాగే అజిత్ నటించిన ‘వాలిమై’, సూర్య ‘ఎదిరిక్కుం తునింధవన్’ మధ్య సంక్రాంతి పోరు ఉంటుందంటున్నారు. మణిరత్నం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ -1 కూడా సంక్రాంతి కే విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇవి కాకుండా మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాలతో పాటు మరొ కొన్ని చిన్న సినిమాల నిర్మాతలు కొత్తగా ప్రకటించిన విడుదల తేదీలతో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలలో ఏవేవి తెలుగులోనూ ఒకే సమయంలో విడుదల అవుతాయో చూడాలి.

Related Articles

Latest Articles