‘బిగ్ బాస్’5 రేటింగ్ జారిపోయిందా!?

ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుని 5వ సీజన్ లోకి అడుగు పెట్టింది ఈ షో. ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా 2వ సీజన్ కు నాని హోస్ట్ గా మారాడు. ఆ తర్వాత మూడు, నాలుగు సీజన్స్ తో పాటు ప్రస్తుతం నడుస్తున్న 5వ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్. కొద్దిగా అటూ ఇటు అయినా ముందు నాలుగు సీజన్స్ ప్రేక్షకాదరణతో చక్కటి టిఆర్సీలను సాధించింది ఈ రియాలిటీ షో. నిజానికి నాల్గవ సీజన్ ఆరంభ కార్యక్రమానికి మంచి టిఆర్పీ సాధించినా ఆ తర్వాత నీరసపడి దారుణంగా డ్రాప్ అయింది. వెంటనే మేల్కొన్న నిర్వాహకులు పోటీదారులు మధ్య గిల్లి కజ్జాల వంటివి ప్లాన్ చేసి మళ్ళీ షో రసవత్తరంగా నడిచేలా స్క్రిప్ల్ మార్చి ప్రేక్షకులు తమ వైపు తిప్పుకున్నారు. అక్కడ నుంచి ఊపందుకుని 4వ సీజన్ కూడా హిట్ అనిపించుకుంది.


టీఆర్పీ డ్రాప్
ఈ 5వ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కి టిఆర్పీలు దారుణంగా పడిపోయినట్లు సమాచారం. 4వ సీజన్ తొలి రోజు దాదాపు 18 టిఆర్పీ సాధించిన ఈ గేమ్ షో 5వ సీజన్ ఆరంభ కార్యక్రమం టీఆర్పీ మాత్రం 12 దాటలేదట. ఇది ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో పోటీ ఛానెల్లో వస్తున్న ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’, వీకెండ్ లో వస్తున్న ‘మాస్టర్ చెఫ్’ లకు కూడా టీఆర్పీలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కొంతలో కొంత ఊరట. ఇక ‘బిగ్ బాస్’ సీజన్ 5 రెండో రోజు, మూడో రోజు ఎపిసోడ్స్ చూసిన వారికి హౌస్ చేపల మార్కెట్ ని తలపించిందనే చెప్పాలి. బిగ్ బాస్ స్క్రిప్ట్ కి అనుగుణంగా నటిస్తున్న పోటీదారుల నటనలో జీవమే లేదు. ఇదిలాగే కొనసాగితో ఈ సీజన్ దారుణంగా ప్లాప్ అవటం ఖాయం. మరి బిగ్ బాస్ స్ట్రాటజీ మార్చి ఆడియన్స్ ని షోలో ఇన్ వాల్వ్ అయ్యేలా చేయటానికి ఏం చేస్తారో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-