ఉక్రెయిన్ సాక్షిగా అమెరికా ర‌ష్యా మ‌ధ్య మ‌ళ్లీ కోల్డ్ వార్ మొద‌లౌతుందా?

ర‌ష్యా, ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల మ‌ధ్య ఉద్రిక్త‌లు నెల‌కొన్నాయి.  ఉక్రెయిన్ తూర్పు స‌రిహ‌ద్దుల వెంట ర‌ష్యా భారీ ఎత్తున సైనికుల‌ను, యుద్ద ట్యాంకుల‌ను మొహ‌రించింది.  ఉక్రెయిన్‌ను రష్యా ఆక్ర‌మించుకోవాల‌ని చూస్తోంద‌నే వ‌దంతులు వ్యాపించ‌డంతో అమెరికా ఉలిక్కిప‌డింది.  ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ వీడియోకాల్‌లో మాట్లాడారు.  దాదాపు రెండున్న గంట‌ల‌సేపు వారి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  ప‌ల‌క‌రింపుల‌తో మొద‌లైన వీడియో కాల్ క్ర‌మంగా ఉక్రెయిన్ పై చ‌ర్చ‌వైపు మ‌ళ్లింది.  

Read: హ్యుందాయ్ భారీ ప్ర‌ణాళిక‌… 4వేల కోట్ల‌తో… ఇండియాలో…

ఉక్రెయిన్‌ను నాటో కూట‌మిలో చేర్చుకోవాల‌నే ఆలోచ‌న‌ను అమెరికా మానుకోవాల‌ని, ఆ దిశ‌గా చ‌ట్ట‌ప‌రమైన హామీని ఇవ్వాల‌ని పుతిన్ కోరారు.  ఉక్రెయిన్‌ను ఆక్ర‌మించుకోవాల‌నే ఆలోచ‌నల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ర‌ష్యాకు వార్నింగ్ ఇచ్చారు.  రెండు దేశాల మ‌ధ్య పాత రోజుల‌ను త‌ల‌పించేలా మాట‌ల యుద్దం న‌డుస్తున్న‌ది.  మాట‌ల యుద్ధం కోల్డ్ వార్‌కు దారితీయ‌కుండా ఉంటే చాల‌ని నిపుణులు చెబుతున్నారు.  రెండు అగ్ర‌దేశాల మ‌ధ్య స్నేహ‌బంధం ఉంటే ప్ర‌పంచం మ‌రింత అభివృద్ది సాధిస్తుంద‌ని, శ‌తృత్వం మొద‌లైతే అది ఆ రెండు దేశాల‌కు మాత్ర‌మే కాకుండా ప్ర‌పంచ దేశాల‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని నిపుణులు ఆందోళ‌న చెందుతున్నారు.  

Related Articles

Latest Articles