సోషల్ మీడియాపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం!

సోషల్ మీడియాలో కరోనా వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ టీకాలపై ప్రముఖ సామాజిక మాద్యమం ఫేస్ బుక్ లో దుష్ప్రచారం జరుగుతోందని తెలిపారు. సోషల్ మీడియా అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అసత్య ప్రచారంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకోవద్దని కోరారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదని.. కరోనా వ్యాక్సిన్ వేసుకోని వారిలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోందని బైడెన్ తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-