గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా భూపేంద్ర‌భాయ్ ప‌టేల్‌…

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా భూపేంద్ర ల‌క్ష్మీకాంత్ ప‌టేల్ ఎంపిక‌య్యారు.  ఈరోజు గుజ‌రాత్ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిపై చ‌ర్చించారు.  భూపేంద్ర‌భాయ్ ప‌టేల్‌ను ముఖ్య‌మంత్రిగా ఎన్నుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  ఈ విష‌యాన్ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ అధికారికంగా ప్ర‌క‌టించారు.  2017లో జ‌రిగిన ఎన్నికల్లో భూపేంద్ర ల‌క్ష్మీకాంత్ ప‌టేల్ అత్య‌థిక మెజారిటీతో గెలుపొందారు.  కాంగ్రెస్ అభ్య‌ర్థి శ‌శికాంత్ ప‌టేల్‌పై 1,17,000 ఓట్ల మెజారిటీతో భూపేంద్ర‌భాయ్ ప‌టేల్ విజ‌యం సాధించారు.  ప‌టేల్ సామాజిక వ‌ర్గంలో అత్యంత ప‌లుకుబ‌డి ఉన్న బ‌ల‌మైన నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న్ను ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నారు.  వ‌ర‌స‌గా ఏడోసారి గుజ‌రాత్‌లో అధికారం చేప‌ట్టేందుకు బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం వ్యూహాలు ప‌న్నుతోంది.  ఇందులో భాగంగానే ముఖ్య‌మంత్రిని మార్చింది.  రాష్ట్రంలో ప‌టేల్ సామాజిక వ‌ర్గానికి బ‌ల‌మైన ఓటు బ్యాంకింగ్ ఉండ‌టంతో ఆ వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు అధిష్టానం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ప‌టేల్ సామాజిక వ‌ర్గానికి చెందిన నితిన్ పటేల్ ప్ర‌స్తుతం ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.  ఆయ‌న అదే ప‌దవిలో కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: అమెరికాలో వ్యాక్సిన్ ర‌చ్చ‌… వ్యాక్సిన్ తీసుకోకుంటే…

Related Articles

Latest Articles

-Advertisement-