బిగ్ బాస్ ఎంపిక వార్తలపై స్పందించిన భూమిక

బుల్లితెర బిగ్ బాస్ షో ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ నడుస్తోంది. కన్నడ, మళయాలం, తెలుగు, తమిళం, బెంగాలీ ఇలా ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ షో ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. అయితే ఈ షో గురించి, ఆమెకు వస్తోన్న ఆఫర్ల గురించి హీరోయిన్ భూమిక తాజాగా స్పందించారు. తనకు ఆఫర్లు వచ్చిన మాట నిజమే గానీ వాటిని ఇంత వరకు అంగీకరించలేదు.. ఎప్పుడూ అంగీకరించను కూడా అని తెగేసి చెప్పేశారు. ఇక హిందీలో పద్నాలుగు సీజన్లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో ఆమె ఎంట్రీ ఖాయం అన్నట్లుగా పలు వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి. దీంతో ఈ వార్తలపై భూమిక వాటిని అసత్య కథనాలుగా కొట్టిపారేసింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-