ఈరోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం చాలా బాధాకరం

వైసీపీ ప్రభుత్వం ఈ రోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం చాలా బాధాకరం అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. రైతులకు ఎంతో ఉపయోగపడే అర్.ఎ.ఆర్.ఎస్ భూములను మెడికల్ కాలేజీకి కేటాయించడం సబబు కాదు. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట భీమా కింద రూ.12 వేల 52 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.900 కోట్లు మాత్రమే విడుదల చేసింది అని తెలిపారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైంది. గత ప్రభుత్వం లో రైతులకు సున్నా వడ్డీకి 3 లక్షలు రుణాలు ఇస్తే ఈ ప్రభుత్వం లక్ష మాత్రమే ఇస్తుంది. కౌలు రైతులకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తామన్నారు,ఇంత వరకు ఎంత మంది కౌలు రైతులకు లబ్ది చేకూర్చారో చెప్పాలి అని భూమా బ్రహ్మానంద రెడ్డి అడిగారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-