‘భూత్ పోలీస్’ వచ్చేది ఎప్పుడంటే…

హారర్ కామెడీ హిందీ చిత్రం ‘భూత్ పోలీస్’ విడుదల తేదీ ఖరారైంది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను నిర్మాతలు రమేశ్ తౌరాని, ఆకాశ్ పురి నిజానికి సెప్టెంబర్ 10వ తేదీ వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు జనం థియేటర్లకు ఏ మేరకు వస్తారనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.

Read Also : మోస్ట్ పవర్ ఫుల్ వాటర్ ఫాల్స్ ఆడవాళ్ళ కన్నీళ్ళు: భాగ్యరాజ్

దాంతో కొద్ది రోజుల క్రితమే తమ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేస్తామని నిర్మాతలు చెప్పేశారు. తాజాగా ఇప్పుడు సెప్టెంబర్ 17న ‘భూత్ పోలీస్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని స్పష్టం చేశారు. వినోద ప్రధానమైన ఈ సినిమాను పవన్ కృపలానీ డైరెక్ట్ చేశారు. ఇటీవలే ఈ మూవీలో మాయ పాత్ర చేస్తున్న యామి గౌతమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. దానికి మంచి అప్లాజ్ వచ్చింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-