మహమ్మారి కాలంలో మహా మంచి ‘చౌక’ బేరం!

తెలుగులో ఓటీటీ వ్యాపారం ఇంకా జోరందుకోవటం లేదు. బాగా పేరున్న నటీనటులు, దర్శకులు థియేటర్ల వైపే చూస్తున్నారు. కానీ, బాలీవుడ్ సీన్ రివర్స్ గా ఉంది. థియేటర్స్ మూతపడ్డ వెంటనే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వైపు నిర్మాతలు పరుగులు తీస్తున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా టేబుల్ ప్రాఫిట్స్ వస్తుండటంతో ప్యాండమిక్ టైంలో ఇదే మంచి చౌక బేరం అనుకుంటున్నారు. తాజాగా మరో రెండు చెప్పుకోదగ్గ చిత్రాలు డిస్నీ హాట్ స్టార్ ఖాతాలో పడ్డాయి. అయితే, స్టార్ నెట్ వర్క్ భారీగా డబ్బులు కుమ్మరిస్తోంది బీ-టౌన్ మూవీస్ కోసం…

సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, యమీ గౌతమ్ నటించిన హారర్ కామెడీ ‘భూత్ పోలీస్’. ఈ సినిమాని డిస్నీ సంస్థ 60 నుంచీ 65 కోట్లు చెల్లించి స్వంతం చేసుకున్నట్టు సమాచారం. కేవలం డిజిటల్ మాత్రమే కాకుండా సాటిలైట్ రైట్స్ కూడా స్టార్ నెట్ వర్క్ వశం చేసుకుందట. అయితే, ‘భూత్ పోలీస్’ నిర్మాణానికి 40 కోట్లకు మించి ఖర్చు కాకపోవటంతో ప్రొడ్యూసర్ ఎలా చూసినా 20 నుంచీ 25 కోట్ల మధ్య టేబుల్ ప్రాఫిట్ సంపాదించుకున్నాడని ముంబై టాక్.

‘భూత్ పోలీస్’ బాటలోనే పరేశ్ రావల్, శిల్ప శెట్టి, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ నటించిన ప్రియదర్శన్ కామెడీ ఎంటర్టైనర్ ‘హంగామా 2’ కూడా డిస్నీ హాట్ స్టార్ ను చేరింది. ఈ సినిమాకి కూడా స్టార్ నెట్ వర్క్ 30 కోట్ల వరకూ చెల్లించిందని అంటున్నారు. అయితే, కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే అమ్మారని ఒక టాక్. ఒకవేళ స్టార్ నెట్ వర్క్ డిజిటల్ తో పాటూ సాటిలైట్ హక్కులు కూడా తీసుకుంటే ‘హంగామా 2’ నిర్మాతలకి మరో 6 నుంచీ 8 కోట్లు వసూలవుతాయట. అంటే, 36 లేదా 38 కోట్లకు ‘హంగామా’ డీల్ సెట్ అయిందని మనం భావించవచ్చు. పరేశ్ రావల్, శిల్పా శెట్టి లాంటి సీనియర్ యాక్టర్స్ ఉండటంతో ‘హంగామా 2’ ఖచ్చితంగా ఆన్ లైన్ లో అందర్నీ అలరిస్తుందని డిస్నీ హాట్ స్టార్ సంస్థ భావిస్తోందట.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-