వారం ముందే రాబోతున్న ‘భూత్ పోలీస్’!

సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్, జావేద్ జఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భూత్ పోలీస్’. పవన్ కృపలానీ దర్శకత్వంలో రమేశ్ తౌరానీ, అక్షయ్ పూరి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీ సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ ఇప్పుడు దీన్ని ఓ వారం ముందుగానే అంటే ఈ నెల 10వ తేదీనే ప్రసారం చేయబోతున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలిపింది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ దెయ్యాలను వదలగొట్టే మంత్రగాళ్ళ పాత్రలు పోషిస్తున్నారు. ఈ టీమ్ తో పనిచేయడం తనకు ఇదే మొదటిసారి అని, అయితే… అందరి సహకారంతో అనుకున్న విధంగా సినిమాను పూర్తి చేయగలిగానని, ప్రేక్షకులకు ‘భూత్ పోలీస్’ చక్కని వినోదాన్ని అందిస్తుందని దర్శకుడు పవన్ కృపలానీ చెబుతున్నాడు.

Related Articles

Latest Articles

-Advertisement-