సైఫ్, అర్జున్ కపూర్ : ‘భూతాల్ని’ పట్టుకునేందుకు బయలుదేరిన బాలీవుడ్ ‘పోలీసులు’!

ఓటీటీ బాట పట్టిన మరో బాలీవుడ్ బిగ్ మూవీ ‘భూత్ పోలీస్’. దెయ్యాల్ని వెంటాడే పోలీసులుగా సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ నటించిన ఈ హారర్ కామెడీ సెప్టెంబర్ నెలలో థియేటర్స్ కు రావాల్సి ఉంది. కానీ, నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకున్నారు. డిస్నీ హాట్ స్టార్ ఇచ్చిన ఆఫర్ కి అంగీకరించి డిజిటల్ రిలీజ్ కు సై అన్నారు. అయితే, ‘భూత్ పోలీస్’ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే అధికారికంగా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.

యమీ గౌతమ్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఫీమేల్ లీడ్స్ గా నటించిన సైఫ్ అండ్ అర్జున్ స్టారర్ తాజాగా మరో అప్ డేట్ తో జనం ముందుకొచ్చింది. హీరోలిద్దరి వెరైటీ లుక్స్ మేకర్స్ సొషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సైఫ్ అలీఖాన్ చేతిలో వింత మంత్ర దండం పట్టుకుని టోటల్ బ్లాక్ కాస్ట్యూమ్స్ లో కనిపించాడు. అర్జున్ కపూర్ కూడా పూర్తి నల్లటి బట్టలు ధరించి చేతిలో కాగడాతో కొత్తగా కనిపించాడు. పవన్ కృప్లానీ దర్శకత్వం వహించిన ‘భూత్ పోలీస్’ ప్రస్తుతం సొషల్ మీడియాలో పెద్ద హ్యాష్ ట్యాగ్ గా మారింది. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్టర్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైకి వస్తోన్న లెటెస్ట్ క్రేజీ సినిమాల్లో ఇది కూడా ఒకటి…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-