సిద్ధూకి మధు శుభాకాంక్షలు.. అత్త కూడా శుభాశీస్సులు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఓ పక్క ఫ్యాన్స్ హంగామా, మరోవైపు సినిమాల అప్డేట్స్ తో సోషల్ నెట్వర్క్స్ లో పవన్ మేనియా కనిపిస్తోంది. ప్రముఖులు కూడా పవన్ కు తమదైన స్టైల్ లో పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, పవన్ విషెస్ చేసిన లిస్ట్ లో భూమిక, నదియాలు స్పెషల్ గా నిలుస్తున్నారు. ఎందుకంటే, పవన్ వారితో చేసిన సినిమాలు అంత ప్రత్యేకం మరి..

పవన్ కళ్యాణ్ – భూమిక కాంబినేషన్ లో వచ్చిన ‘ఖుషి’ సినిమా వీరిద్దరికి ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు యూత్ లో క్రేజ్ మరింత పెరిగింది. అప్పటివరకు రొటీన్ వచ్చిన సినిమా కథలకు ఖుషి సినిమా పూర్తి భిన్నంగా ఉండటంతో భారీ హిట్ ను సొంతం చేసుకోంది. ఎస్.జే సూర్య ఈ ఇగో లవ్ స్టోరీని చాలా బాగా తెరకెక్కించగా.. ఎ.ఎం.రత్నం నిర్మించారు. కాగా తాజాగా భూమిక పవన్ కు వీడియో ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేసింది.

ఇక పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కీలక పాత్ర చేసిన నటి నదియా కూడా పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇకముందు కూడా మీరు మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్’ అంటూ విష్ చేసింది. కాగా, ఈ సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించగా.. నదియా అత్త పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత కలిసిన సినిమా కావడంతో ఆమెకు ఈ సినిమా మంచి పేరును తీసుకొచ్చింది. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాని మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కించారు. ఒక పక్క పవన్ ఇమేజ్‌ని పడిపోకుండా మైంటైన్ చేస్తూనే మరోపక్క అదిరిపోయే ఎమోషన్స్‌ని మిక్స్ చేసి ఈ సినిమాని తీర్చిదిద్దాడు.

Related Articles

Latest Articles

-Advertisement-